Homeటాప్ స్టోరీస్విజయ్ కొత్త చిత్రం టైటిల్ ఏంటో తెలుసా

విజయ్ కొత్త చిత్రం టైటిల్ ఏంటో తెలుసా

vijay
vijay

తమిళ స్టార్ హీరో విజయ్ తాజాగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమాలో ఫుట్ బాల ప్లేయర్ గా నటిస్తున్నాడు విజయ్ . ఇక ఈ చిత్రానికి నిన్న టైటిల్ ప్రకటించారు విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని . ఇంతకీ ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా …….. బిగిల్ . బిగిల్ అంటే విజిల్ అని అర్ధం . ఏదైనా ఆట ఆడుతుంటే అది ప్రేక్షకులకు కిక్ ఇస్తుంటే విజిల్ కొట్టడం కామన్ కదా అందుకే ఈ చిత్రానికి బిగిల్ అని పెట్టారట .

విజయ్ అంటేనే మాస్ హీరో అందునా స్టైలిష్ హీరో కూడా దాంతో ఫుట్ బాల్ ఆట కూడా చాలా స్టైలిష్ గా ఉండనుందట . ఇంతకుముందు అట్లీ – విజయ్ ల కాంబినేషన్ లో వచ్చింది తేరి , మెర్సల్ చిత్రాలు రాగా రెండు కూడా బ్లాక్ బస్టర్ లు అయ్యాయి . ఇక ఇప్పుడు మూడో సినిమాగా బిగిల్ వస్తోంది . ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All