Homeగాసిప్స్ప్రేమ‌జంట పేరెంట్స్ కాబోతున్నారా?

ప్రేమ‌జంట పేరెంట్స్ కాబోతున్నారా?

ప్రేమ‌జంట పేరెంట్స్ కాబోతున్నారా?
ప్రేమ‌జంట పేరెంట్స్ కాబోతున్నారా?

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ గ‌త కొంత కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుదేవాతో విడిపోయిన త‌రువాత న‌య‌న‌తార ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అత‌నితో ప్రేమ‌లో పడిన న‌య‌న్ గ‌త కొంత కాలంగా ఆయ‌న‌తో స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో త్వ‌ర‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌బోతోందంటూ గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

త‌మ రిలేష‌న్ షిప్ గురించిఎన్ని వార్త‌లు షికారు చేస్తున్నా ఈ ప్రేమ జంట మాత్రం పెద‌వి విప్ప‌డం లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా, అవార్డ్ ఫంక్ష‌న్స్‌లోనూ క‌లిసి వున్న ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా షేఊర్ చేస్తూ ఆ వార్త‌ల్ని ఇంత కాలం బ‌ల‌ప‌రుస్తూ వ‌స్తున్నారు. తాజాగా మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో విఘ్నేష్ శివ‌న్ షేర్ చేసిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది.

- Advertisement -

ఓ చిన్ని పిల్ల‌వాణ్ణిని ఎత్తుకున్న న‌య‌న‌తార ఫొటోని షేర్ చేసిన విఘ్నేష్ శివ‌న్ ఆ ఫొటోకు `నా కాబోయే పిల్లల తల్లి చేతిలో పిల్లల తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు` అని క్యాప్ష‌న్ ఇవ్వ‌డంతో ఈ ఏడాదే వీరు పేరెంట్స్ కాబోతున్నార‌నే సంకేతాలు అందించిన‌ట్టుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు ఓ ఇంటివారు కాబోతున్నారు. ఆ అర్థం స్పురించేలా విఘ్నేష్ పెట్టిన పోస్ట్ వుండ‌టంతో అంతా ప్రేమ జంట పేరెంట్స్ కాబోతున్నారా? అని ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్క‌తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All