
తమిళ హిట్ చిత్రం `కో`. ఇదే చిత్రాన్ని తెలుగులో `రంగం` పేరుతో రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించి ఆకట్టుకున్న అజ్మల్ అమీర్ త్వరలో హీరోగా ఓ చిత్రం చేయబోతున్నాడు. నయనతారతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విగ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మిచమోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విగ్నేష్ శివన్ ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటించారు.
తాజాగా ఈ చిత్రాన్ని ప్రారంభించి చెన్నైపరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించనుంది. `అవన్` చిత్రాన్ని తెరకెక్కించిన మిలింద్ రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని బ్లైండ్ అనే కొరియన్ చిత్రం ఆధారంగా రూపొందించబోతున్నరు. విభిన్నమైన కథతో తెరపైకి రాబోతున్న ఈ చిత్రానికి `నేట్రికన్` అనే టైటిల్‌ని కూడా ఇప్పటికే ఖరారు చేశారు.
ఓ అంధురాలి కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా ఛాలెంజింగ్ పాత్రలో నటించనుందని తెలిసింది. అజ్మల్ అమీర్ పాత్ర కూడా చాలా కొత్తగా వుంటుందని, నటనకు ఆస్కారమున్న పాత్రలో అజ్మల్ కనిపిస్తారని తమిళ చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అజ్మల్ పుట్టిన రోజుని సెట్‌లోనే యూనిట్ సభ్యుల మధ్య జరిపారు. ఈ సందర్భంగా నయనతార, విగ్నేష్ శివన్ ఈ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.