Homeటాప్ స్టోరీస్జనతా కర్ఫ్యూ పాటిద్దాం – విక్టరీ వెంకటేష్

జనతా కర్ఫ్యూ పాటిద్దాం – విక్టరీ వెంకటేష్

జనతా కర్ఫ్యూ పాటిద్దాం – విక్టరీ వెంకటేష్
జనతా కర్ఫ్యూ పాటిద్దాం – విక్టరీ వెంకటేష్

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ రేపు అనగా ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రజలందరూ.. తమ ఇళ్ల వద్దనే ఉండాలని.. అన్ని పనులను వాయిదా వేసి కర్ఫ్యూకి సంఘీభావం ప్రకటించాలని విక్టరీ వెంకటేష్ అభిమానులను మరియు తన ప్రజలను ఉద్దేశించి ఒక వీడియో విడుదల చేశారు.

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండవ దశలో ఉంది. అంటే విదేశాల నుంచి లేదా ఇతర ప్రాంతాల నుంచి రోగగ్రస్తం అయిన వ్యక్తులు వచ్చే వస్తే తప్ప వారి నుంచి వైరస్ సంక్రమించడం జరగడం లేదు. వైరస్ ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నట్లు మూడు నాలుగు దశలోకి విస్తరించింది అంటే.. అప్పుడు ప్రజలందరిలో ఒక్కసారిగా వేలాది మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. అప్పుడు అపారమైన ప్రాణనష్టం జరగడమే కాకుండా దేశంలో ఉన్న అన్ని వ్యవస్థకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజికంగా దూరం పాటించాలనీ… రేపు జనతా కర్ఫ్యూ లో అందరూ పాల్గొనాలని వెంకటేష్ తెలిపారు

- Advertisement -

 కరోనా వైరస్ పై ఇప్పటికే ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, పోలీసుశాఖ శాఖ సిబ్బందికి సాయంత్రం ఐదు గంటలకు కృతజ్ఞతగా కరతాళధ్వనులతో వారికి సామాజిక సంఘీభావం ప్రకటించాలని కూడా వెంకటేష్ పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా థియేటర్ల తోపాటు సినిమా షూటింగులు కూడా అయిన సంగతి తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All