Homeటాప్ స్టోరీస్నాగార్జున కోసం ఫైట్ మాస్ట‌ర్‌గా హీరో ఫాద‌ర్!‌

నాగార్జున కోసం ఫైట్ మాస్ట‌ర్‌గా హీరో ఫాద‌ర్!‌

నాగార్జున కోసం ఫైట్ మాస్ట‌ర్‌గా హీరో ఫాద‌ర్!‌
నాగార్జున కోసం ఫైట్ మాస్ట‌ర్‌గా హీరో ఫాద‌ర్!‌

నాగార్జున న‌టిస్తున్న తాజా చిత్రం `వైల్డ్ డాగ్‌`. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు.  మ్యాట్ని ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైద‌రాబాద్‌లో 2009లో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఏడు నెల‌ల క్రితం లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే హైద‌రాబాద్‌లో మొద‌లైంది.

ఇక్క‌డ షెడ్యూల్ పూర్తి కావ‌డంతో చిత్ర బృందం హిమాల‌యాల స‌మీపంలోని మ‌నాలిలో షూటింగ్ జ‌రుగుతోంది. 21 రోజుల పాటు అక్కడ కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించ‌బోతున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభ‌మైంది. నాగార్జున పాల్గొన‌గా ప‌లు కీల‌క పోరాట ఘ‌ట్టాల‌ని షూట్ చేస్తున్నారు. విశేషం ఏంటంటే ఈ పోరాట ఘ‌ట్టాల్ని ఓ బాలీవుడ్ హీరో ఫాద‌ర్ ఫైట్ మాస్ట‌ర్‌గా ఫైట్స్‌ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌.

- Advertisement -

ఆ బాలీవుడ్ హీరో మ‌రెవ‌రో కాదు విక్కీ కౌష‌ల్‌. `యురీ` చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపుల‌ర్ అయిన విక్కీ కౌష‌ల్ ఫాద‌ర్ శ్యామ్ కౌష‌ల్ హీరో నాగార్జున పాల్గొన‌గా పోరాట ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని శ్యామ్ కౌష‌ల్ సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. మ‌నాలిలోని రోహ్‌తంగ్ పాస్ జీరో డిగ్రీ కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త వుంటుంది. దేవుడి ద‌య‌వ‌ల్ల షూటింగ్ జ‌రుగుతోంది. ఈ రోజు అక్క‌డ మంచు కురుస్తోంది` అని ట్వీట్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All