
`మన్మథుడు- 2` నిరాశపరచటడంతో సైలెంట్‌గా వున్నాడనుకున్ననాగార్జున సడెన్‌గా షాకిచ్చారు. ఆయన
సైలెంట్‌గా మరో చిత్రాన్ని పూర్తి చేసి ఆశ్చర్యపరిచారు. నాగార్జున ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నతాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సొలోమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. నాగార్జున ఈ చిత్రంలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు.
అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మని డిపార్ట్‌మెంట్‌లో అంతా వైల్డ్ డాగ్ అని పిలుస్తుంటారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కనిపిస్తున్నకథనాన్ని బట్టి ఒక సీక్రెట్ ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడంతో రంగంలోకి విజయ్ వర్మని ప్రత్యేక ఆపరేషన్ కోసం డిపార్ట్‌మెంట్ దింపుతుంది. స్పెషల్ టీమ్‌తో ఆపరేషన్ మొదలుపెట్టిన విజయ్ వర్మ ఆరుగురు కరుడు గట్టిన తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్ చేస్తాడు. ఇదే తరహా ఎన్‌కౌంటర్‌లని చేసి డిపార్ట్‌మెంట్‌లో సంచలనం సృష్టించిన విజయ్‌వర్మ ఇంతకీ ఎవరు?. అతని వెనకున్న కథేంటి అన్నదే `వైల్డ్ డాగ్` ప్రధాన కథగా తెలుస్తోంది.
కొత్త తరహా కథతో యాదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది. `నిజజీవిత సంఘటనల స్ఫూర్తితో వస్తున్న సినిమాలో చాలా ఏళ్ల తరువాత నటిస్తున్నాను. ఈ సినిమాలో ఎన్ ఐ ఏ ఆఫీసర్‌గా కనిపిస్తాను. న్యూ ఏజ్ టెక్నీషియన్స్‌తో న్యూ స్టైల్ మేకింగ్‌తో వస్తున్న సినిమా ఇది. కొత్త విషయాల్నినేర్చుకోవడం ఆపలేదు. 2020 గోయింగ్ టు బీ ఎక్సైటింగ్ ఇయర్` అని నాగార్జున ట్వీట్ చేశారు.