Homeటాప్ స్టోరీస్రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న ఈ సీనియర్ నటుడు

రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న ఈ సీనియర్ నటుడు

రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న ఈ సీనియర్ నటుడు
రవితేజ సినిమాతో రీఎంట్రీ ఇస్తోన్న ఈ సీనియర్ నటుడు

వేణు తొట్టెంపూడి గుర్తున్నాడా? ఎర్లీ 2000లలో పలు చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని విజయం సాధించాయి కూడా. క్రమంగా వేణు హీరో వేషాలు చెల్లలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా మారాడు కూడా. ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రంలో వేణు కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వాటికి కూడా దూరమైన వేణు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు.

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రంలో వేణు కీలక పాత్రకు ఎంపికైనట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఖిలాడీ తర్వాత రవితేజ చేస్తోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రాన్ని శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో వేణు కూడా నటిస్తున్నాడు.

- Advertisement -

ఈ చిత్రంలో హీరోయిన్లుగా దివ్యంశ కౌశిక్, రజిష విజయన్ నటిస్తోన్న విషయం తెల్సిందే. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. మరోవైపు రవితేజ ఖిలాడీ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. ఈ ఏడాదిలోనే ఖిలాడీ విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All