Homeటాప్ స్టోరీస్రవితేజ ఆన్ డ్యూటీ అంటున్నాడే!

రవితేజ ఆన్ డ్యూటీ అంటున్నాడే!

రవితేజ ఆన్ డ్యూటీ అంటున్నాడే!
రవితేజ ఆన్ డ్యూటీ అంటున్నాడే!

మాస్ మహారాజా రవితేజ స్పీడ్ మాములుగా లేదు. క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ ఆ తర్వాత జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసాడు. ఇక ప్రస్తుతం శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ఈరోజు చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. దాంతో పాటు సినిమా టైటిల్ ను కూడా రివీల్ చేసారు. ఈ సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసారు. రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపిస్తున్నాడు.

- Advertisement -

దివ్యంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All