Homeటాప్ స్టోరీస్మేజిస్ట్రేట్ ఆఫీస్ లో పనిలోకి దిగిన రవితేజ

మేజిస్ట్రేట్ ఆఫీస్ లో పనిలోకి దిగిన రవితేజ

మేజిస్ట్రేట్ ఆఫీస్ లో పనిలోకి దిగిన రవితేజ
మేజిస్ట్రేట్ ఆఫీస్ లో పనిలోకి దిగిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఖిలాడీ షూటింగ్ దాదాపుగా పూర్తైన నేపథ్యంలో రవితేజ తన  ఫోకస్ ను నెక్స్ట్ చిత్రంపై పెట్టాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించే చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు ఈరోజు విడుదల చేసిన పోస్టర్ చుస్తే అర్ధమవుతోంది. మేజిస్ట్రేట్ ఆఫీస్ లో సీరియస్ వర్క్ లో ఉన్నాడు రవితేజ.

అగ్రెసివ్ రోల్ లో రవితేజ కనిపిస్తాడని సమాచారం. దివ్యంశ కౌశిక్ ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా కనిపించనుంది. మరో హీరోయిన్ ను ఇంకా ఫైనలైజ్ చేయాలి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈరోజు చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.

- Advertisement -

సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి  సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో రివీల్ కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All