Homeటాప్ స్టోరీస్రొమాంటిక్ మూడ్ లో మాస్ మహారాజా

రొమాంటిక్ మూడ్ లో మాస్ మహారాజా

రొమాంటిక్ మూడ్ లో మాస్ మహారాజా
రొమాంటిక్ మూడ్ లో మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోన్న విషయం తెల్సిందే. క్రాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చిన రవితేజ ఇప్పుడు ఖిలాడీ చిత్రాన్ని పూర్తి చేసాడు. కరోనా కారణంగా మూడు నెలలు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టాడు రవితేజ. శరత్ మండవను దర్శకుడిగా పరిచయం చేస్తూ రవితేజ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హార్స్లీ హిల్స్, చిత్తూర్ లో సాగుతోంది. మజిలీ ఫేమ్ దివ్యంశ కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. రవితేజ రొమాంటిక్ గా దివ్యంశను పట్టుకున్న వర్కింగ్ స్టిల్ ను అధికారికంగా విడుదల చేసారు.

- Advertisement -

మరో రెండు నెలల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాడు రవితేజ. ఈ సినిమాలో ప్రభుత్వ అధికారి పాత్రలో మాస్ మహారాజా నటిస్తున్నాడట. ఇంకా టైటిల్ నిర్ణయించిన ఈ సినిమాకు సంబంధించిన మరింత సమాచారం త్వరలో తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All