Homeగాసిప్స్మళ్ళీ వార్తల్లో ఎఫ్ 3, నెక్స్ట్ అదేనా?

మళ్ళీ వార్తల్లో ఎఫ్ 3, నెక్స్ట్ అదేనా?

మళ్ళీ వార్తల్లో ఎఫ్ 3, నెక్స్ట్ అదేనా?
మళ్ళీ వార్తల్లో ఎఫ్ 3, నెక్స్ట్ అదేనా?

దర్శకుడు అనిల్ రావిపూడి 2019లో అతిపెద్ద హిట్ కొట్టాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్ 2తో అనిల్ మరుపురాని హిట్ ను అందించాడు. తాను సక్సెస్ఫుల్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్లు కూడా అందించగలనని తెలియజేసినట్లు అయింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఎఫ్ 2, దాదాపు 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి అందరినీ షాక్ కు గురిచేసింది. 2019లో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా ఎఫ్ 2 నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజైనప్పుడే దీనికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు టీమ్. అయితే హిట్ అయిన ఆనందంలో ఇలా చెప్పి ఉంటారులే అని లైట్ తీసుకున్నారు చాలా మంది. ఈ సినిమా గురించి తర్వాత ఎక్కడా అటు దర్శకుడు కానీ ఇటు హీరోలు కానీ ఏం చెప్పకపోవడంతో ఎఫ్ 3ను మరిచిపోయి ఉంటారులే అని అనుకున్నారు. అయితే విక్టరీ వెంకటేష్ ఇటీవలే ఎఫ్ 3 గురించి స్పందించారు.

ఎఫ్ 2 కు సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని చెప్పాడు వెంకటేష్. ఈ సినిమా పనులు త్వరలో మొదలవుతాయని కూడా చెప్పాడు. హీరోలుగా తాను, వరుణ్ నటిస్తామని.. హీరోయిన్లు మాత్రం వారే ఉండకపోవచ్చని చెప్పాడు. స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, ఎఫ్ 2 కు కొనసాగింపుగా ఉంటుందా లేక కొత్త కథతో వస్తారా అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు వెంకటేష్.

- Advertisement -

ప్రస్తుతం వెంకటేష్ అసురన్ రీమేక్ లో నటించడానికి సన్నద్ధమవుతున్నాడు. అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్ర విడుదల సన్నాహకాల్లో ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామాలో నటించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు. సరిలేరు నీకెవ్వరు పూర్తైన వెంటనే అనిల్ రావిపూడి ఎఫ్ 3 కథపై కూర్చుంటాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాదే ఎఫ్ 3 పట్టాలపైకి ఎక్కొచ్చు.

మరి మనకు సీక్వెల్స్ ఆడినట్లు చరిత్రలో లేదు. దాన్ని అనిల్ రావిపూడి అండ్ బృందం ఎలా అధిగమిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All