Homeటాప్ స్టోరీస్సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
సరిలేరు కథపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు సర్వం సిద్ధమైపోయింది. ఒకవైపు సెన్సార్ క్లియరెన్స్ వచ్చేసింది. అటు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. జనవరి 5న ఎల్బీ స్టేడియంలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు మొదలయ్యాయి. థియేటర్ల వద్ద ఇప్పటినుండే కటౌట్లు వెలుస్తున్నాయి. సినిమా యూనిట్ సభ్యులు కూడా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిలేరు నీకెవ్వరు కథ గురించి క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించబోతున్న విషయాన్ని ముందే ప్రకటించారు సరిలేరు టీమ్. అయితే టీజర్ చూసినా, కర్నూల్ కొండారెడ్డి బురుజు సెంటర్ సెటప్ చూసినా కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఎంత సేపు ఆర్మీ మేజర్ గా ఉంటాడు, తర్వాత ఎలా కథ మారుతుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో ఉన్నాయి. అయితే వీటిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. నిజానికి ఈ విషయాలను దర్శకుడు గోప్యంగా ఉంచొచ్చు. కానీ అనిల్ రివీల్ చేయడం కొసమెరుపు.

- Advertisement -

సినిమా మొదలు మహేష్ ఆర్మీ మేజర్ గానే పరిచయం కానున్నాడట. ఆ తర్వాత మహేష్ సభ్య సమాజంలోకి అడుగుపెడతాడన్నమాట. ఇక్కడ కమర్షియల్ యాంగిల్ కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెటప్ ను వాడుకున్నాడు దర్శకుడు. విజయశాంతి పాత్ర, కథలోని కీలక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అన్నీ ఇక్కడే వస్తాయని చెప్పుకొచ్చాడు. ఒక ఆర్మీ మేజర్ కు ఈ సమాజంలో సమస్య ఎదురైనప్పుడు అతను దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది కీలకంగా ఉంటుందిట.

ఈ కథకు అనిల్ రావిపూడి తరహా చమక్కులు, పంచ్ లు, ప్రాసలు కలిసి సినిమా ఆద్యంతం అలరిస్తుందని అంటున్నారు. విజయశాంతి పాత్ర గురించి కొంత సస్పెన్స్ మైంటైన్ చేయడం విశేషం. అయితే మహేష్-విజయశాంతి కాంబినేషన్ లోని సీన్లు అలరిస్తాయని చెబుతున్నాడు దర్శకుడు. మొత్తంగా సరిలేరు నీకెవ్వరు అన్ని వర్గాల వారికి నచ్చే చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All