Homeటాప్ స్టోరీస్అనిల్ రావిపూడి మళ్ళీ అంచనాలను పెంచేసాడుగా

అనిల్ రావిపూడి మళ్ళీ అంచనాలను పెంచేసాడుగా

Anil Ravipudi raises expectations on Sarileru Neekevvaru
Anil Ravipudi raises expectations on Sarileru Neekevvaru

అపజయం అన్నదే లేకుండా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఒక్కసారిగా మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసాడు. మిడ్ రేంజ్ హీరోలతో నాలుగు సినిమాలు చేసిన అనిల్ అన్ని సినెమాలతోనూ సక్సెస్ లను అందుకున్నాడు. అయితే తొలిసారి టాప్ స్టార్ నుండి పిలుపొచ్చింది. ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ కు మహేష్ వెంటనే పిలిచి అవకాశమిచ్చాడు. ఆర్మీ మేజర్ బ్యాక్ డ్రాప్ లో సరిలేరు నీకెవ్వరు ప్రాజెక్ట్ ను సెట్ చేసాడు అనిల్. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు పూర్తైపోయి సంక్రాంతి రిలీజ్ కు ముస్తాబవుతోంది. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమాకు అన్నీ ప్లస్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ కు, ఇప్పటివరకూ విడుదలైన పాటలకు అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్నిస్తోన్న మరో అంశం.. ఈ సినిమాపై అనిల్ చూపిస్తున్న కాన్ఫిడెన్స్. సరిలేరు నీకెవ్వరు కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది అన్న తరహాలోనే అనిల్ రావిపూడి మాట్లాడుతున్నాడు. రీసెంట్ గా విశాఖ ఉత్సవంలో మాట్లాడుతూ మహేష్ కు గిఫ్ట్ రెడీ అయిపోయిందని చెబుతూ మహేష్ ఫ్యాన్స్ కు ఉత్తేజపరిచాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మహేష్ కు మంచి గిఫ్ట్ సిద్ధంగా ఉందని అన్నాడు అనిల్.

- Advertisement -

ఇంకా మాట్లాడుతూ దేవి శ్రీ ఎఫ్ 2 సమయంలోనూ ఫీడ్ బ్యాక్ ఇచ్చాడు. కచ్చితంగా సినిమా మెప్పిస్తుందని ఇదే విశాఖ ఉత్సవంలో మాట్లాడాం. ఇప్పుడు సరిలేరు విషయంలో కూడా ఇదే చెబుతున్నాం. ఈసారి కూడా దేవి ఫీడ్ బ్యాక్ గురి తప్పదు. సూపర్ స్టార్ జెన్యూన్ పర్సన్. ఆయన రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్. అందుకే ఆయనకో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా.

ఇక సినిమా గురించి విశేషాలు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ – మహేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయని అన్నాడు. అలాగే ప్రకాష్ రాజ్, విజయశాంతి పాత్రలు కూడా ఉత్సాహపరుస్తాయని, మొత్తంగా సరిలేరు నీకెవ్వరు అన్ని అంశాలు కలగలిసి ఉన్న చిత్రమని వ్యాఖ్యానించాడు. ఈ స్పీచ్ తో మహేష్ ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All