Homeటాప్ స్టోరీస్మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న వెంకటేష్

మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న వెంకటేష్

మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న వెంకటేష్
మూడు ప్రాజెక్టులను లైన్లో పెడుతోన్న వెంకటేష్

విక్టరీ వెంకటేష్ మంచి స్పీడుమీదున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను పూర్తి చేసాడు వెంకటేష్. నారప్ప, దృశ్యం 2 కూడా ఓటిటి రిలీజ్ లు అవుతున్నాయి. ఇదిలా ఉంటె త్వరలోనే ఎఫ్3 షూటింగ్ ను మొదలుపెడతాడు వెంకీ, మైసూర్ లో ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలవుతుంది.

ఎఫ్3 తర్వాత వెంకటేష్ చేయబోయే చిత్రాల విషయంలో కొంచెం క్లారిటీ వచ్చింది, మలయాళ సూపర్ హిట్ డ్రైవింగ్ లైసెన్స్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు వెంకటేష్. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దాంతో కనుక సంతృప్తి చెందితే వెంటనే పట్టాలెక్కుతోంది.

- Advertisement -

మరోవైపు దర్శకుడు త్రినాథరావు నక్కినతో చిత్రం రెండేళ్ల నుండి చర్చల దశలో ఉంది. ఈ ఏడాదే దీనిపై కూడా క్లారిటీ ఇస్తాడు వెంకీ. ఇక తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ కూడా అంతే. ఈ స్క్రిప్ట్ తో వెంకటేష్, సురేష్ బాబు సంతృప్తి చెందినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో చిత్రాన్ని ప్రకటించనున్నారు.

అయితే ఏ సినిమా ముందు, ఏది వెనకాల అన్నది త్వరలోనే తెలుస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All