Homeటాప్ స్టోరీస్దృశ్యం 2 డిజిటల్ రిలీజ్ హింట్ ఇచ్చిన వెంకీ మామ

దృశ్యం 2 డిజిటల్ రిలీజ్ హింట్ ఇచ్చిన వెంకీ మామ

దృశ్యం 2 డిజిటల్ రిలీజ్ హింట్ ఇచ్చిన వెంకీ మామ
దృశ్యం 2 డిజిటల్ రిలీజ్ హింట్ ఇచ్చిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్ మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 ను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. దృశ్యం 1 తెలుగు వెర్షన్ లో కూడా వెంకటేష్ ప్రధాన పాత్రను పోషించాడు. దృశ్యం 2 షూటింగ్ రికార్డ్ సమయంలో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఒరిజినల్ తరహాలోనే తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందని ప్రచారం జరిగింది.

ఇప్పుడు దానికి సపోర్ట్ చేసేలా వెంకీ హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప డిజిటల్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అందరూ వెంకీ పెర్ఫార్మన్స్ ను మెచ్చుకున్నారు కూడా. నిన్న నారప్ప సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ దృశ్యం 2 కూడా ఇదే తరహాలో విడుదలవుతుందని హింట్ ఇచ్చాడు. ఎఫ్3తో మళ్ళీ మిమ్మల్ని థియేటర్లలో కలుసుకుంటానని వెల్లడించాడు.

- Advertisement -

ఇక పరిస్థితిని అర్ధం చేసుకుని తనను సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపాడు వెంకీ మామ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All