మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి ” అంతరిక్షం ” అనే టైటిల్ ని ఫిక్స్ చేసాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి . ఘాజి చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి తాజాగా అంతరిక్షం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈరోజు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు . అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి ఆ టైటిల్ ని పెట్టారు దర్శకుడు . ఫిదా , తొలిప్రేమ వంటి వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్ కు ఇది తప్పకుండా డిఫరెంట్ సినిమా అయ్యేలా ఉంది .
వరుణ్ తేజ్ సరసన అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి లు నటిస్తున్నారు . దాదాపుగా షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమాని జాగర్లమూడి సాయిబాబు , రాజీవ్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సంకల్ప్ రెడ్డి దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .
English Title: Varun Tej Antariksham First Look