Homeటాప్ స్టోరీస్“కరోనా క్రైసిస్ చారిటీ” విభాగానికి విరాళాల వెల్లువ

“కరోనా క్రైసిస్ చారిటీ” విభాగానికి విరాళాల వెల్లువ

“కరోనా క్రైసిస్ చారిటీ” విభాగానికి విరాళాల వెల్లువ
“కరోనా క్రైసిస్ చారిటీ” విభాగానికి విరాళాల వెల్లువ

కరోనా వైరస్ సంక్షోభం వల్ల సినిమాలకు సంబంధించిన అన్ని రకాల పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక సినిమా పరిశ్రమకు సంబంధించి సినిమా ఇండస్ట్రీ పై ఆధారపడిన ఎంతోమంది రోజువారీ కార్మికులను ఆదుకోవటానికి మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో “కరోనా క్రైసిస్ చారిటీ” అనే ఒక ప్రత్యేక విభాగాన్నినెలకొల్పారు. సినిమా తారలు మరియు సాంకేతిక నిపుణులు తమ వంతు ప్రయత్నంగా విరాళాలని ఈ సంస్థకు అందిస్తున్నారు.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ విభాగానికి 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మరొక యువ హీరో వరుణ్ తేజ్ శర్వానంద్ కూడా స్పందించి ఈ విభాగానికి తనవంతుగా15 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అదేవిధంగా యువ హీరో కార్తికేయ గుమ్మకొండ 2 లక్షల రూపాయల విరాళాన్ని; మరియు నటుడు సంపూర్ణేష్ బాబు 1 లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

- Advertisement -

ప్రస్తుతం కరోనా వైరస్ అధికంగా వ్యాప్తి చెందకుండా 21 రోజుల పాటు లాక్ డౌన్ ఉన్ననేపథ్యంలో ప్రజలందరూ తమ ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలని; వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు సామాజిక దూరం పాటించాలని; కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటించాలని; కరోనా వైరస్ పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ వారికి అన్ని రకాలుగా సహకరించాలని సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All