Homeటాప్ స్టోరీస్పెళ్లి రూమ‌ర్‌ల‌పై స్పందించింది!

పెళ్లి రూమ‌ర్‌ల‌పై స్పందించింది!

పెళ్లి రూమ‌ర్‌ల‌పై స్పందించింది!
పెళ్లి రూమ‌ర్‌ల‌పై స్పందించింది!

కోలీవుడ్ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటున్నారు. త‌న‌పై ఎలాంటి రూమ‌ర్ వ‌చ్చిన వెంట‌నే స్ప‌పందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన సంచ‌ల‌నం సృష్టించిన వ‌ర‌ల‌క్ష్మి తాజాగా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. గ‌తంలో హీరో విశాల్‌తో వ‌ర‌ల‌క్ష్మి ప్రేమ‌లో వుంద‌ని, త్వ‌ర‌లో వీరిద్ద‌రూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేసిన విష‌యం తెలిసిందే.

న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌ల వేళ వ‌ర‌ల‌క్ష్మి తండ్రి శ‌ర‌త్‌కుమార్‌కు, విశాల్ కు మ‌ధ్య వైరం తారా స్థాయికి చేర‌డంతో స్వ‌యంగా రంగంలోకి దిగిన వ‌ర‌ల‌క్ష్మి హీరో విశాల్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అయితే తాజాగా ఆమె క్రికెట‌ర్ సందీప్‌తో ప్రేమ‌లో వుందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ వార్త‌ల‌పై స్పందించిన వ‌ర‌ల‌క్ష్మి త‌న వివాహం పై మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోందంటూ చుర‌క‌లంటించింది. `నేను వివాహం చేసుకోబోతున్నాన‌ని చివ‌రగా నేను ఎందుకు తెలుసుకున్నాను. హాహా హా.. నా వాహం అన్న‌దే అర్థం లేని పుకారు. నా పెళ్లి గురించి పై క‌ప్పు ప‌గిలిపోయేలా అర‌వండి. నేను వి‌వాహం చేసుకోవ‌డం లేదు. సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌డం లేదు అంటూ వ‌ర‌ల‌క్ష్మి ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర‌ల‌క్ష్మి ప్ర‌స్తుతం తెలుగులో `క్రాక్‌`, నాంది వంటి చిత్రాల్లో న‌టిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All