Homeటాప్ స్టోరీస్వ‌ర‌ల‌క్ష్మి కూడా ఆ సినిమా చూడ‌మంటోంది!

వ‌ర‌ల‌క్ష్మి కూడా ఆ సినిమా చూడ‌మంటోంది!

Varalaxmi sarathkumar refer Contagion film
Varalaxmi sarathkumar refer Contagion film

యావ‌త్ ప్ర‌పంచం మొత్తం  జ‌పిస్తున్న పేరు క‌రోనా.. క‌రోనా.. దీని భారిన ప‌డిన వారు ఐసోలేష‌న్‌..క్వారెంటైన్‌.. వంటి ప‌దాలు వ‌ల్లెవేస్తున్నారు. క‌రోనా సోకిందంటే క్వారెంటైన్ (దిగ్భంధం)  కావాల్సిందే. ..ఐసోలేష‌న్ (ఒంట‌రి)గా వుండాల్సిందే. ఈ ప‌దాల్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది క‌రోనా అనుకుంటే పొర‌పాటే అంత‌కు ముందే అంటే దాదాపు 9 ఏళ్ల క్రిత‌మే క‌రోనా వైర‌స్‌పై హాలీవుడ్‌లో ఓ సినిమా వ‌చ్చింది. ప్ర‌స్తుతం భ‌యంక‌ర‌మైన క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచం బాధ‌ప‌డుతున్న దృశ్యాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించింది.

ఆ సినిమా పేరు `కాంటాజియ‌న్‌`. 2011లో వ‌చ్చిన ఈ సినిమా విడుద‌లైన‌ప్పుడు ఎవ‌రికీ తెలియ‌దు. ఎవ‌రూ దీన్ని ప‌ట్టించుకోలేదు కూడా. ఏదో పిచ్చి కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఈ సినిమాని తీశాడ‌ని అంతా కొట్టిపారేశారు. ఇదో పిచ్చి సినిమా అని ప‌క్క‌న పెట్టారు. 9 ఏళ్ల త‌రువాత అదే నిజ‌మైంది. ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ వ‌ణికిస్తోంది. క‌రోనా విజృంభ‌ణ మొద‌లు కావ‌డంతో `కాంటాజియ‌న్‌` చిత్రాన్ని ల‌క్ష‌ల్లో చూడ‌టం మొద‌లుపెట్టారు.

- Advertisement -

తాజాగా ఈ చిత్రాన్ని త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ చూసింద‌ట‌. క‌రోనా వైర‌స్ ఎంత డేంజ‌రో ఈ సినిమా చూస్తే మీకే అర్థ‌మ‌వుతుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్‌ల‌కు స్ప‌ష్టం చేస్తోంది. క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తున్న నేప‌థ్యంలో అంతా ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని వ‌ర‌ల‌క్ష్మి సూచించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All