Homeటాప్ స్టోరీస్రాధిక‌ని త‌ల్లిగా ఒప్పుకోను : వ‌ర‌ల‌క్ష్మి

రాధిక‌ని త‌ల్లిగా ఒప్పుకోను : వ‌ర‌ల‌క్ష్మి

రాధిక‌ని త‌ల్లిగా ఒప్పుకోను : వ‌ర‌ల‌క్ష్మి
రాధిక‌ని త‌ల్లిగా ఒప్పుకోను : వ‌ర‌ల‌క్ష్మి

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మీటూ వుంద‌ని, స్టార్ కిడ్‌ని అయినా త‌న‌ని కూడా అది వెంటాడింద‌ని, దాని బారిన ప‌డ‌కుండా సేఫ్ జోన్‌లో వుంటూ ఇప్ప‌టికి 25 చిత్రాలు పూర్తి చేశాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసి వార్త‌ల్లో నిలిచింది వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. తాజాగా న‌టి రాధిక‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌ర‌ల‌క్ష్మీ న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `వెల్వెట్ న‌గ‌రం`. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా ఓ త‌మిళ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంట‌ర్వూలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు త‌న త‌దుప‌రి చిత్రాల‌పై వ‌ర‌ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. రాధిక‌పై చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఏ విష‌యాన్నైనా ముక్కుస‌టిగా మాట్లాడే వ‌ర‌ల‌క్ష్మి త‌న స‌వ‌తి త‌ల్లి, న‌టి రాధిక‌ని త‌ల్లిగా ఒప్పుకోన‌ని, అమ్మ అని ఎప్ప‌టికీ పిల‌వ‌న‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -

త‌న స‌వ‌తి త‌ల్లి రాధిక‌ను వ‌ర‌ల‌క్ష్మి ఆంటీ అని పిలుస్తార‌ట‌. ఈ విష‌యాన్ని ప్రస్తావిస్తే.. ఈ ప్ర‌శ్న త‌న‌ని చాలా మంది అడిగార‌ని, రాధిక మా అమ్మ కాదు కానీ నేను ఆమెతో స‌న్నిహితంగానే వుంటాను. నాన్నిని, ఆమె పెళ్లి చేసుకుని సంతోషంగా వుండ‌టం నాకు సంతోష‌మే. అయితే రాధిక ఆంటీ కుమార్తె రియానేకు మా నాన్న మంచి తండ్రిగా వున్నార‌ని స‌మాధానం దాట‌వేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All