Homeటాప్ స్టోరీస్ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!
ప‌వ‌ర్‌స్టార్ బ‌ర్త్‌డే గిఫ్ట్ వ‌చ్చేసింది!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన రోజు రానే వ‌చ్చేసింది. త‌మ ఆరాధ్య న‌టుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన రోజున కొత్త సినిమా అప్‌డేట్‌ల కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కి `వ‌కీల్ సాబ్‌` మోష‌న్ పోస్ట‌ర్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గ‌రువారం ప‌వ‌న్ బ‌ర్త్‌డే కావ‌డంతో గ‌త వారం నుంచే ఫ్యాన్స్ హంగామా మొద‌లైంది. సోష‌ల్ మీడియాని ట్వీట్‌ల‌తో ఓ రేంజ్‌లో మోతెక్కించేస్తున్నారు. ట్వీట్‌ల వ‌ర్షం‌తో హోరెత్తిస్తున్నారు.

`వ‌కీల్‌సాబ్‌` పోస్ట‌ర్ ఫ్యాన్స్ జోష్‌ని మ‌రింత పెంచేసింది. క్రిమిన‌ల్ లాతో అది కుద‌ర‌దంటే దుడ్డు క‌ర్ర‌తో దండించ‌డం ఈ లాయ‌ర్ స్టైల్ అనేట్టుగా మోష‌న్ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ క్యారెక్ట‌ర్ క‌నిపిస్తున్న తీరు సినిమాని హిందీ, త‌మిళ్ చిత్రాల‌కు మించి ఏ స్థాయిలో మ‌ర్చార‌న్న‌ది అర్థ‌మ‌వుతోంది. ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు త‌మ‌న్ అందించిన సంగీతం ఆక‌ట్టుకుంటోంది. ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌` ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

- Advertisement -

వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల‌, ప్ర‌కాష్‌రాజ్, అన‌సూయ‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  ఇప్ప‌టికే ఈ చి్త‌ర షూటింగ్ పూర్త‌యి రిలీజ్ కావాల్సి వుంది కానీ క‌రోనా కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All