
మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు ధర్నా చేసారు ఈరోజు . మా కుటుంబ పెద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ తీసుకోవడమే కాకుండా మా పంట పొలాలలో షూటింగ్ చేసుకొని పంటలు నాశనం చేసి డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడేమో మాకు సంబంధం లేదు అంటూ చులకన చేస్తున్నారని విమర్శలు చేసారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు .
- Advertisement -
చిరంజీవి కొడుకు చరణ్ మాకు న్యాయం చేస్తానని చెప్పి , పంట పొలాల నష్టపరిహారం ఇస్తానని చెప్పి ఇప్పుడేమో ముఖం చాటేస్తున్నాడని ఆరోపిస్తున్నారు . అయితే చిరు ఇంటిముందు ధర్నా జరుగుతోందని తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి నరసింహారెడ్డి కుటుంబీకులకు సర్దిచెప్పి అక్కడి నుండి పంపించారు . సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఈ వివాదాలు మరింతగా ముదిరే అవకాశం ఉంది .
- Advertisement -