Homeటాప్ స్టోరీస్నటుడిగా 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న చిరంజీవి

నటుడిగా 40 ఏళ్ళు పూర్తిచేసుకున్న చిరంజీవి

Punadi Rallu
Punadi Rallu

మెగాస్టార్ చిరంజీవి నటుడిగా నలభై ఏళ్ళు పూర్తిచేసుకున్నాడు . కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి గా మారింది ” పునాది రాళ్లు ” చిత్రంతో . 1978 వ సంవత్సరంలో నటుడిగా ముఖానికి రంగేసుకుంది పునాదిరాళ్ళు చిత్రంతోనే . అయితే విడుదల అయిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు . దాంతో చిరంజీవి మొదటి సినిమా అంటే టక్కున ప్రాణం ఖరీదు అని చెబుతారు కానీ అవకాశం వచ్చింది మాత్రం పునాదిరాళ్లు చిత్రానికే .

పునాది రాళ్లు చిత్రంతో తన కెరీర్ ని ప్రాణప్రదం గా మార్చుకొని సినీరంగంలో మెగాస్టార్ గా అవతరించాడు . వారసుల రాజ్యం కొనసాగుతున్న రోజుల్లో వారసులను కాదని స్వయం కృషితో ఎదిగిన మగమహారాజు ఈ చిరంజీవి .

- Advertisement -

నలభై ఏళ్ల కెరీర్ లో 150 కి పైగా సినిమాలు చేసిన చిరు కమర్షియల్ అన్న పదానికి పర్యాయ పదంగా నిలిచాడు . తెలుగు సినిమాకు సరికొత్త కమర్షియల్ హంగులు అద్దిన హీరోల్లో చిరంజీవి దే అగ్రస్థానం .ఈ నలభై ఏళ్ల కెరీర్ లో దాదాపు 9 ఏళ్ల పాటు సినిమాలు చేయకపోయినా ఈతరం హీరోలతో పోటీపడుతూ టాలీవుడ్ మెగాస్టార్ గా తన ప్రత్యేకతని నిరూపించుకున్నాడు . తాజాగా సైరా నరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు చిరు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All