Homeటాప్ స్టోరీస్బన్నీ ఫేట్ మార్చిన డేట్ కు రానున్న మెగా హీరో

బన్నీ ఫేట్ మార్చిన డేట్ కు రానున్న మెగా హీరో

బన్నీ ఫేట్ మార్చిన డేట్ కు రానున్న మెగా హీరో
బన్నీ ఫేట్ మార్చిన డేట్ కు రానున్న మెగా హీరో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలి చిత్రం గంగోత్రి అయినా కూడా, ఆ సినిమా విజయం సాధించినా కూడా ఆ చిత్రం విషయంలో ఫ్యాన్స్ కూడా అంత గర్వంగా ఫీలవ్వరు. ఆ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలానే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అసలు హీరోగా అల్లు అర్జున్ పనికిరాడంటూ కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ ఆ విమర్శలకు కుంగిపోలేదు. వాటి నుండే మెట్టూ మెట్టూ ఎక్కుతూ ఈరోజు స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. టాప్ 5 హీరోస్ లో అల్లు అర్జున్ స్థానం ఇప్పుడు పదిలం. అయితే వీటన్నిటికీ మూలం ఆర్య చిత్రమే. రెండో సినిమాతోనే అల్లు అర్జున్ భారీ హిట్ సాధించి మెగా ఫ్యాన్స్ ను ఆకర్షించాడు బన్నీ. ఆర్య చిత్రంతోనే సుకుమార్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆర్య విడుదలైన రోజు మే 7.

ఇప్పుడు అదే డేట్ కు మరో మెగా హీరో రానున్నాడు. సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం ఉప్పెనను ఆర్య విడుదల రోజైన మే 7న దించాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఉప్పెన చిత్రాన్ని మొదట ఏప్రిల్ 2న విడుదల చేయడానికి ఫిక్స్ అయ్యారు. అయితే కరోనా ఎఫెక్ట్ తో ఏప్రిల్ 2న విడుదల చేయడం అన్నది అసాధ్యమని తేలిపోయింది. దీంతో ఇప్పుడు చిత్ర విడుదల తేదీని మార్చాలని ఫిక్స్ అయ్యారు. అందుకే మే 7 అయితే సెంటిమెంట్ ప్రకారంగా కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన రోజే సుకుమార్ శిష్యుడు కూడా వస్తుండడం విశేషమే. అలాగే ఒక మెగా హీరోకి లైఫ్ ఇచ్చిన సినిమా రిలీజ్ అయిన డేట్ నాడు మరో మెగా హీరో సినిమా విడుదలవ్వడం కూడా ఫ్యాన్స్ కు ఊతమిచ్చే అంశమే. మరి ఇంతకీ ఉప్పెన మే 7న రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All