Homeటాప్ స్టోరీస్ఊపిరి మొత్తం ఉప్పెనైతే “ధక్...ధక్...ధక్”

ఊపిరి మొత్తం ఉప్పెనైతే “ధక్…ధక్…ధక్”

ఊపిరి మొత్తం ఉప్పెనైతే “ధక్...ధక్...ధక్”
ఊపిరి మొత్తం ఉప్పెనైతే “ధక్…ధక్…ధక్”

మనం ప్రేమించిన వాళ్లైనా… మనల్ని ప్రేమించిన వాళ్లైనా… లేదా ఒకరికొకరు పర్సాపారం ప్రేమించుకున్న ఇద్దరు జంట…. ఎప్పుడు కలుసుకున్నా.. ఒకరకమైన అండంతో కూడిన భయంతో కలిగే ప్రేమ అనే ఫీలింగ్ ఉంటుంది. ఆ భావాన్ని మాటల్లో కంటే పాటల్లో, పోయెట్రీ లో ఎన్నో పోలికలు కల్పించి చెప్తే వినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు డైరెక్టర్ బుచ్చి బాబు సానా అదే ప్రయత్నం చేసారు. ఆయన తీస్తున్న “ఉప్పెన” సినిమాలో రెండో పాటగా “ధక్…ధక్…ధక్” అనే పాట రిలీజ్ చేసారు. ఈ పాటను సాహిత్యశ్రేష్ట చంద్ర బోస్ గారు రాసారు. శరత్ సంతోష్, హరిప్రియ ఆలపించారు.

ఎన్నో ఏళ్లుగా…. రిచ్ – పూర్ లవ్ స్టోరీ లైన్ అనేది ఒక సక్సెస్ ఫుల్ మీటర్. మరో చరిత్ర, సీతాకోకచిలుక దగ్గర నుండి మొదలెడితే నేటికాలంలో తేజ గారు చేసిన “నువ్వు –నేను”, జయం సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక ఈ పాటలో ముఖ్యంగా హీరోయిన్ కృతి శెట్టి కళ్ళతో పలికించిన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. పేపర్ చదువుతున్న హీరోకు వెనుక సజెషన్ లో చిరంజీవి పెయిటింగ్ ఉంచడం అభిమానులకు మంచి కిక్ ఉంటుంది. ఇక సంగీతం విషయానికి వస్తే, దేవిశ్రీప్రసాద్ గారు ముఖ్యంగా సుకుమార్ గారి సినిమా అంటే ఆకాశమే హద్దుగా తనలో సృజనకు పదును పెడతాడని రుజువు అయింది. అంతబాగా తనతో క్రియేటివ్ గా కనెక్ట్ అయిన సుకుమార్ గారు మరియు ఇప్పుడు బుచ్చిబాబు కి హ్యాట్సాఫ్.

- Advertisement -

పాట రెండో పల్లవి నుండి లిరిక్ కి బదులు… క్లాస్ రూమ్ డస్టర్, కాలేజ్ బెల్లు, సైకిల్ బెల్లు, ఆటో హారన్, బార్బర్ చేతిలో ఉండే వాటర్ స్ప్రే… ఇలా అనేక మెటాఫర్స్ వాడుకోవడం దర్శకుని సెన్సిబిలిటీ కి మరొక నిదర్శనం.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All