Homeటాప్ స్టోరీస్అల్లు అర్జున్ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!

అల్లు అర్జున్ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!

అల్లు అర్జున్ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!
అల్లు అర్జున్ సినిమాకు క‌రోనా ఎఫెక్ట్‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో బ‌న్నీ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి చేసిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని సాధించి ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే తిరుగులేని చిత్రంగా రికార్డులు సృష్టించింది. ఈసినిమా ఇచ్చిన స‌క్సెస్ కిక్‌ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ ఈ మూవీ త‌రువాత సుకుమార్ చిత్రానికి ఓకే చెప్పారు. కంప్లీట్ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ బ‌న్నీ లేకుండా పూర్తిచేశారు.

తాజా షెడ్యూల్‌ని బ‌న్నీపై కేర‌ళ అడ‌వుల్లో ప్లాన్ చేశారు. ఈ నెల 13 లేదా 15నుంచి భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు ద‌ర్శ‌కుడు సుకుమార్‌. అంతా సిద్ధం అనుకున్నారు. బ‌న్నీ కూడా రెడీ. అయితే క‌రోనా వైర‌స్ కేసుల కేర‌ళ‌లోనూ బ‌య‌ట‌ప‌డుతుండ‌టంతో సుకుమార్ టీమ్‌లో భ‌యం మొద‌లైంద‌ని తెలిసింది. అల్లు అర్జున్ కూడా షెడ్యూల్‌ని వాయిదా వేద్దామ‌ని ఏప్రిల్ మొద‌టి వారం నుంచి కంట‌న్యూ చేద్దామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో సుకుమార్ కూడా ఓకే చెప్పిన‌ట్టు టీమ్ మెంబ‌ర్స్ చెబుతున్నారు.

- Advertisement -

ఈ చిత్రంలో అల్లు అర్జున్ ప‌క్కా మాసీవ్ పాత్ర‌లో లారీడ్రైవ‌ర్‌గా క‌నిపించబోతున్నారు. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి ఫారెస్ట్ రేంజ‌ర్‌గా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న గ్రామీణ యువ‌తిగా స‌హ‌జ‌త్వానికి అత్యంత ద‌గ్గ‌ర‌గా వుండే పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని తెలిసింది. ఇటీవ‌లే సుకుమార్ ర‌ష్మిక లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేశారు కూడా. క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గితే ఏప్రిల్ నుంచి రెగ్య‌ల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్టే ఈ చిత్రాన్ని మ‌రో `రంగ‌స్థ‌లం` తీర్చి దిద్దాల‌ని సుకుమార్ ప్లాన్‌లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All