
మలయాళ చిత్ర సీమలో టాప్ స్టార్స్‌కి ఒక దశలో కంటిమీద కునుకు లేకుండా చేసింది షకీలా. బిగ్రేడ్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీలో షేక్ చేసింది. ఆ తరువాత క్రమంగా ఆ తరహా చిత్రాల్లో నటించడం మానేసి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటించడం మొదలుపెట్టింది. తెలుగులో ఇ.వి.వి రూపొందించిన `తొట్టిగ్యాంగ్` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
అప్పటి నుంచి అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు సినిమాల్లో నటిస్తూనే వుంది. అయితే తాజాగా తనని ప్రశ్నించిన నెటిజన్స్‌కి టకటకా సమాధానాలు చెప్పిన షకీలా అల్లు అర్జున్ గురించి అడిగే సరికి ఫాక్ ఇచ్చేసింది. తనెవరో తెలియదనిచ అతని గురించి తనకు తెలియదని చెప్పేసింది. ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని, మహేష్ గురించి తనకు తెలుసని, అతని సోదరి మంజులతో తనకు మంచి పరిచయం వుందని చెప్పిన షకీలా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎందకలా చెప్పిందన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.
అల్లు అర్జున్‌కు తెలుగులో ఏ స్థాయి ఫ్యాన్ ఫాలొయింగ్ వుందో మలయాళంలోనూ అదే స్థాయిలో ఫ్యాన్స్ వున్నారు. అలాంటి క్రేజీ హీరో గురించి షకీలా కావాలనే తనకు తెలియదని చెప్పడం పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం షకీలా ఓ కుటుంబ కథా చిత్రానికి కథ అందించింది. అందుకే ఆ సినిమాకు `షకీలా రాసిన కుటుంబ కథా చిత్రం` అని టైటిల్ పెట్టారు.