Homeటాప్ స్టోరీస్నిన్న బ‌న్నీ కోసం.. ఇప్పుడు మ‌ హేష్ కోసం?

నిన్న బ‌న్నీ కోసం.. ఇప్పుడు మ‌ హేష్ కోసం?

నిన్న బ‌న్నీ కోసం.. ఇప్పుడు మ‌ హేష్ కోసం?
నిన్న బ‌న్నీ కోసం.. ఇప్పుడు మ‌ హేష్ కోసం?

విల‌క్ష‌ణ చిత్రాల‌తో వెరైటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు క‌న్న‌డ హీరో ఉపేంద్ర‌. ఆయ‌న సినిమాలంటేనే వెరైటి. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తుంటారు. ఏ, ఉపేంద్ర ఇటీవ‌ల ఐ ల‌వ్ యూ చిత్రాల‌తో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసిన ఉపేంద్ర ప్ర‌స్తుతం `క‌బ్జా` చిత్రంలో న‌టిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే హీరోగా బిజీగా వున్న‌ ఉపేంద్ర ఆ మ‌ధ్య స్టైలిష్ స్టార్ బన్నీ న‌టించిన `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి` చిత్రంలో విల‌న్‌గా దేవ‌రాజ్ అనే పాత్ర‌లో విల‌క్ష‌ణ‌మైన మేరిజ‌మ్‌తో న‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్టు తెలిసింది. మ‌హేష్ హీరోగా న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

- Advertisement -

ఈ మూవీ త‌రువాత ఫ్యామిలీతో క‌లిసి యూఎస్‌కి వెకేష‌న్‌కి వెళ్లి వ‌చ్చారు. ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో సినిమా చేస్తార‌ని అంతా భావించారు. కానీ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డంతో ఆ ప్రాజెక్ట్‌ని ప‌క్క‌న పెట్టి ప‌ర‌శురామ్‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విల‌న్‌గా ఉపేంద్ర‌ని చిత్ర బృందం సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. అయితే ఉపేంద్ర ఆలోచించి చెబుతాన‌ని అన్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All