Homeటాప్ స్టోరీస్`ఫాద‌ర్ - చిట్టి- ఉమా - కార్తీక్‌` నుంచి ఇదుగో కార్తీక్!

`ఫాద‌ర్ – చిట్టి- ఉమా – కార్తీక్‌` నుంచి ఇదుగో కార్తీక్!

`ఫాద‌ర్ - చిట్టి- ఉమా - కార్తీక్‌` నుంచి ఇదుగో కార్తీక్!
`ఫాద‌ర్ – చిట్టి- ఉమా – కార్తీక్‌` నుంచి ఇదుగో కార్తీక్!

అలా మొద‌లైంది, అంత‌కు ముందు ఆ త‌రువాత‌, క‌ల్యాణ వైభోగ‌మే వంటి  విభిన్న‌మైన చిత్రాల్ని తెలుగు ప్రేక్ష‌కులకు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ రంజిత్ మూవీస్ అధినేత కె.ఎల్‌. దామోదరప్ర‌సాద్ కొంత విరామం త‌రువాత `FCUK` ఫాద‌ర్ – చిట్టి- ఉమా – కార్తీక్‌` పేరుతో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్‌ని అందిస్తున్నారు.

జ‌గ‌ప‌తిబాబు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. యువ జంట‌గా యంగ్ హీరో రామ్ కార్తీక్, హీరోయిన్‌గా త‌మిళ న‌టి అమ్ము అభిరామి న‌టిస్తున్నారు. డ్యాన్స్ మాస్ట‌ర్ విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల నేప‌థ్యంలో సాగే చిత్ర మిది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -

చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో చ‌యిత్ర బృందం పాత్ర‌ల ప‌రిచ‌యాన్ని మొద‌లుపెట్టింది. తాజాగా మంగ‌ళ‌వారం హీరో రామ్ కార్తీక్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసింది. ఇందులో రామ్ కార్తీక్ పాత్ర పేరు కార్తీక్‌. దీనికి ఓ ఆస‌క్తిక‌ర‌మైన ట్యాగ్ లైన్‌ని కూడా జోడించ‌డం ఆక‌ట్టుకుంటోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All