
ఎన్నో చిత్రాల్లో హీరోగా నటించి `లెజెండ్` చిత్రంతో విలన్‌గా మారిన నటుడు జగపతిబాబు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా గడిపేస్తున్న ఆయన సోదరుడికి బెదిరింపు కాల్స్ రావడం కలకలంగా మారింది. జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. దీంతో యుగేంద్ర కుమార్ బంజారా హిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు.
ఫిల్మ్ నగర్‌లో నివసించే యుగేంద్ర కుమార్‌కు గుట్టల బేగంపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు తెలిసింది. గుట్టల బేగంపేటలోని ఓ స్థలం విషయంలో వివాదం తలెత్తడంతో యుగేంద్రకుమార్‌కు శ్రీనివాస్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. దీంతో జగపతిబాబు సోదరుడు యుగేంద్ర కుమార్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
దీని వెనక బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యేకాలనీకి చెందిన రాజిరెడ్డి హస్తం వున్నట్టు లనుమానించి యుగేంద్రకుమార్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో ఈ వివాదం కలకలం రేపుతోంది. స్వయానా నటుడు జగపతిబాబు సోదరుడిని హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.