Homeటాప్ స్టోరీస్టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
టక్ జగదీష్ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం టక్ జగదీష్ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సింది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేస్తుండడంతో సినిమా రిలీజ్ లు క్యూ కడతాయని అందరూ భావించారు.

అయితే టాలీవుడ్ ఈసారి ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటిదాకా రెండు సినిమాలు మాత్రమే తమ రిలీజ్ డేట్లను ప్రకటించాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా టక్ జగదీష్ జులై 30న విడుదలవుతుందని కొన్ని మీడియా ఛానల్స్ తెలిపాయి. దీనిపై టక్ జగదీష్ నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

తాము రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేదాకా ఎటువంటి రూమర్స్ ను పట్టించుకోవద్దని ప్రకటించాయి. ఈలోగా నాని ఫ్యాన్స్ టక్ జగదీష్ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ  వస్తుందో చూడాలి. ఇక నాని శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All