Homeటాప్ స్టోరీస్నాని మీట్ క్యూట్ లోకి మరో హీరోయిన్

నాని మీట్ క్యూట్ లోకి మరో హీరోయిన్

నాని మీట్ క్యూట్ లోకి మరో హీరోయిన్
నాని మీట్ క్యూట్ లోకి మరో హీరోయిన్

న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణంలో అ!, హిట్ చిత్రాలను నిర్మించాడు. ఇప్పుడు తన ప్రొడక్షన్ లో మూడో చిత్రాన్ని మొదలుపెట్టిన విషయం తెల్సిందే. తన సోదరి దీప్తి ఘంటాను డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు నాని. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అన్న టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు.

మొత్తం ఐదుగురు హీరోయిన్లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తారని తెలుస్తోంది. అలాగే సత్యరాజ్ కీలక పాత్రలో కనిపిస్తాడు. కాజల్ అగర్వాల్, నివేతా థామస్ లు కూడా హీరోయిన్స్ గా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆదా శర్మను ఇప్పటికే ఫైనల్ చేసారు. మీట్ క్యూట్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

- Advertisement -

తాజా సమాచారం ప్రకారం హీరోయిన్ ఆకాంక్ష సింగ్ ను కూడా ఈ చిత్రంలో నటింపజేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ రావా, దేవదాస్ చిత్రాలతో ఆకాంక్ష సింగ్ ఫేమస్ అయింది. వచ్చే ఏడాది మొదట్లో మీట్ క్యూట్ ను విడుదల చేయనున్నాడు నాని.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All