
నటీనటులు: నాని, రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు
దర్శకుడు: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
సంగీతం: థమన్ ఎస్ ఎస్
రేటింగ్ : 2.75/5
న్యాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సినిమా టక్ జగదీష్. థియేటర్లను మిస్ చేసుకుని ఈ చిత్రం ఓటిటిలో విడుదలైంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమ్ అవుతోంది. నాని, శివ నిర్వాణ కలిసి నిన్ను కోరి తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నాని కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
కథ:
బోసు బాబు (జగపతి బాబు) తన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తూ తాతల నాటి ఆస్తి కాజేయాలని చూస్తూ ఉండే వ్యక్తి. కానీ తనకు అడ్డుగా జగదీష్ నాయుడు (నాని) తన తమ్ముడు ఉంటాడు. ఎలా జగదీష్ నాయుడు తన అన్నకు తగిన గుణపాఠం చెప్పాడు, ఎలా తన కుటుంబాన్ని మళ్ళీ ఒకటి చేసాడు అన్నదే సినిమా పాయింట్.
పెర్ఫార్మన్స్:
నాని మరోసారి అదరగొట్టాడు. తన న్యాచురల్ నటనతో నాని తన పాత్రకు వన్నె తెచ్చాడు. రీతూ వర్మ ఉన్నదే కాసేపే అయినా బాగుంది. ఆమె నటన కూడా ఓకే. ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ టైమ్ కూడా తక్కువే అయినా కానీ ఆమె పాత్ర ఎఫెక్టివ్ గా ఉంది. ఇక జగపతి బాబు సాఫ్ట్ రోల్ లో నెగటివ్ షేడ్స్ ను బాగా పండించాడు. విలన్ గా డేనియల్ బాలాజీ పర్వాలేదు. రావు రమేష్ మరియు ఇతరులు తమ పాత్రలకు అలా చేసుకుంటూ వెళ్లిపోయారు.
సాంకేతిక నిపుణులు:
లవ్ స్టోరీలు తీయడంలో మంచి నేర్పరి అని పేరు తెచ్చుకున్నాడు శివ నిర్వాణ. తొలిసారి తనది కాని కథను ఎంచుకున్నాడు. దానికి తగిన మూల్యమే చెల్లించాడు. టక్ జగదీష్ కథ చాలా సాధారణమైంది. ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూసాం. ఇక స్క్రీన్ ప్లే కూడా పాత చింతకాయ పచ్చడి తరహాలోనే సాగింది. కాకపోతే శివ నిర్వాణ మరోసారి తన ప్రత్యేకతను ఎమోషనల్ సన్నివేశాలను డీల్ చేయడంలో చూపించాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి.
థమన్ సంగీతం ఓకే. గోపి సుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. విలేజ్ సన్నివేశాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
చివరిగా:
టక్ జగదీష్ చిత్రం ఒక పాతికేళ్ల క్రితం వచ్చినా కూడా దానికి పదేళ్ల క్రితం వచ్చిన కథలా కచ్చితంగా అనిపిస్తుంది. ఇలాంటి ఓల్డ్ సబ్జెక్ట్ కు అంతే స్లో స్క్రీన్ ప్లే తో శివ నిర్వాణ న్యాయం చేయలేదు. అయితే నాని, మిగతా వాళ్ళ పెర్ఫార్మన్స్ తో సినిమాకు కొంత న్యాయం చేసారు. కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ లు చిత్రాన్ని కొంత మేర నిలబెట్టాయి. మొత్తంగా టక్ జగదీష్ సోసోగా సాగిపోయే యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.