Homeగాసిప్స్వచ్చే ఏడాది భారీ ప్లాన్స్ తో సిద్ధమైన నాని

వచ్చే ఏడాది భారీ ప్లాన్స్ తో సిద్ధమైన నాని

వచ్చే ఏడాది భారీ ప్లాన్స్ తో సిద్ధమైన నాని
వచ్చే ఏడాది భారీ ప్లాన్స్ తో సిద్ధమైన నాని

న్యాచురల్ స్టార్ నాని సాధారణంగా ఏడాదికి రెండు లేదా మూడు చిత్రాలు విడుదల చేస్తుంటాడు. కానీ కరోనా వైరస్ తన ప్లాన్స్ ను వర్కౌట్ కాకుండా చేసింది. గతేడాది నాని వి డైరెక్ట్ ఓటిటిలో విడుదలైన విషయం తెల్సిందే. అలాగే ఇప్పుడు టక్ జగదీష్ కూడా థియేటర్స్ లో కాకుండా ఓటిటిలో సందడి చేయబోతోంది. సెప్టెంబర్ 10 నుండి టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే గత రెండేళ్ల నుండి నానిను థియేటర్లలో మిస్ అయిన తన ఫ్యాన్స్ కోసం వచ్చే ఏడాది భారీ ప్లాన్స్ వేసాడు. ఇప్పటికే శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలవుతుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న అంటే సుందరానికి… వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తాడు. నాని దగ్గర ఇంకా 2,3 ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన విశేషాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -

ఇక నిర్మాతగా కూడా నాని బిజీ. తన సిస్టర్ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ మీట్ క్యూట్ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే అడివి శేష్ హీరోగా హిట్ 2 చిత్రాన్ని నిర్మిస్తాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All