Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు కేటిఆర్ ఫోన్ .... మతలబు ఏంటో

పవన్ కళ్యాణ్ కు కేటిఆర్ ఫోన్ …. మతలబు ఏంటో

TRS secret friend pawan kalyan talks with ktrఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కుటుంబం అయిన కేసిఆర్ కు అస్సలు పడేది కాదు . ముఖ్యంగా కేసిఆర్ , కేటిఆర్ , కవిత ఇలా ఎవరి పేరు విన్నా పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయే వాడు అంతేనా బహిరంగ సమావేశాల్లో సైతం కేసిఆర్ కుటుంబం పై నిప్పులు చెరిగాడు కూడా . అంతేకాదు కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో కేసిఆర్ , కేటిఆర్ , కవిత లను పోలిన పాత్రలను పెట్టించాడు కూడా . దాంతో పవన్ కళ్యాణ్ అంటే కూడా కేసిఆర్ కుటుంబానికి చాలా కోపం కూడా . కట్ చేస్తే ……. ఒకప్పటి శత్రువులు మిత్రులయారు . కేసిఆర్ పాలన బాగుందని చెప్పడమే కాకుండా కేసిఆర్ కు అనుకూలంగా మారాడు పవన్ .

- Advertisement -

ఇక ఇప్పుడేమో కేటిఆర్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి అభినందించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది . తెలంగాణలో పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతోంది టిఆర్ఎస్ . ఇటీవల గోదావరి జిల్లాలో పవన్ జనసేన కవాతు నిర్వహించాడు దానికి అనూహ్య స్పందన రావడంతో కేటిఆర్ ఫోన్ చేసి అభినందించాడట. ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి తెలంగాణ లో కాంగ్రెస్ – టిడిపి కూటమిని దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ టిఆర్ఎస్ కు మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది . తెలంగాణలో జనసేన కు పెద్దగా క్యాడర్ లేదు , కాకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ చర్చలు .

English Title: TRS secret friend pawan kalyan talks with ktr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts