Homeటాప్ స్టోరీస్వాళ్ళు కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నారా ?

వాళ్ళు కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నారా ?

Is vivek and vinod gives shock to kcrమాజీ ఎంపీ వివేక్ , మాజీ మంత్రి వినోద్ లు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు షాక్ ఇవ్వనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఓ టివి ఛానల్ ని నడిపిస్తున్న ఈ సోదరులు ఇటీవలే ఓ పత్రికని కూడా ప్రారంభించారు. ఇక ఈ ఇద్దరు సోదరులు పార్టీ మారాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారంటే వినోద్ కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడమే ! చెన్నూరు ఎం ఎల్ ఏ నల్లాల ఓదేలు కు టికెట్ నిరాకరించి ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కు చెన్నూరు టికెట్ ఇవ్వడమే ఇందుకు కారణం అని అంటున్నారు. బాల్క సుమన్ కు కాకుండా తన సోదరుడు మాజీ మంత్రి వినోద్ కు ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా వివేక్ కోరాడట . దానికి కేసీఆర్ తో పాటుగా కేటిఆర్ కూడా నిరకరించారని దాంతో అహం దెబ్బతిన్న వివేక్ , వినోద్ లు టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరాలని భావిస్తున్నారట.

గత ఎన్నికల్లో కూడా వాళ్ళు టీఆర్ఎస్ తరుపున పోటీ చేయాలా ? కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేయాలో తెలీక చాలా ఇబ్బందిపడ్డారు. చివరకు కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఇద్దరు కూడా ఓడిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు కేసీఆర్ కు షాక్ ఇవ్వడానికి సమాయత్తం అవుతున్నట్లుగా కథనాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమేనా ? కాదా ? అన్నది పక్కన పెడితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి జంపింగ్ లు కామన్ అయిపోయాయి. ఒకవేళ వివేక్ ,వినోద్ లు టీఆర్ఎస్ ని వీడితే కేసీఆర్ కు పెద్ద షాకే మరి.

- Advertisement -

English Title: Is vivek and vinod gives shock to kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All