Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ పావలాకి కూడా పనికి రాడట

పవన్ కళ్యాణ్ పావలాకి కూడా పనికి రాడట

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన అదేపనిగా విమర్శలు చేస్తున్నాడని అసలు పావలాకు కూడా పనికిరాని పవన్ మా నాయకులను విమర్శించడం ఏంటి ? అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది తెలుగుదేశం పార్టీ సాధినేని యామిని . వారసత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కళ్యాణ్ కు లేదని , సినిమారంగంలో చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ని స్టూడియో గేటు ముందుకు కూడా రానిచ్చేవాళ్ళు కాదని , అసలు పవన్ కళ్యాణ్ ని హీరోగా ఎవరు తీసుకునే వాళ్ళు చిరు అనే కేరాఫ్ అడ్రస్ లేకపోతే అంటూ పవన్ పై నిప్పులు చెరిగింది సాధినేని యామిని .

ఇటీవల పవన్ కళ్యాణ్ తరచుగా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ అదేపనిగా నారా లోకేష్ పై విమర్శలు చేస్తున్నాడు . నారా లోకేష్ కనీసం సర్పంచ్ గా కూడా గెలవలేడని అలాంటి వాడికి పంచాయతీరాజ్ శాఖని కట్టబెట్టారని , కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అయితే మంత్రిగా అవకాశం కల్పిస్తారా ? అంటూ పవన్ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం శ్రేణులు పవన్ పై విరుచుకు పడుతున్నారు . ఇక సాధినేని యామిని అనే మహిళా ఏకంగా పవన్ కళ్యాణ్ పావలా పైసలకు కూడా పనికి రాడని ,మా లోకేష్ తలతలలాడే 2000 రూపాయల నోటు లాంటి వాడని అంటోంది .

- Advertisement -

English Title: TDP leader controversial comments on pawan kalyan

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All