Homeటాప్ స్టోరీస్జనసేనలో చేరనున్న చిరంజీవి

జనసేనలో చేరనున్న చిరంజీవి

Chiranjeevi eyes on pawan's janasena ప్రజారాజ్యం అంటూ రాజకీయ పార్టీని పెట్టి 2009 ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి  గుడ్ బై చెప్పి తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి . 2019 లో ఆంధ్రప్రదేశ్ లో శాసనసభతో పాటుగా కేంద్రం లో కూడా ఎన్నికలు రానున్నాయి దాంతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి అన్నాదమ్ములు ఇద్దరూ చేయి చేయి కలపనున్నట్లు తెలుస్తోంది . ఒకసారి 2009 లో చంద్రబాబు ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ప్రజారాజ్యం బాగా పనిచేసింది . వ్యతిరేక ఓటు పెద్ద ఎత్తున చీలడంతో చంద్రబాబు ఓడిపోయాడు దాంతో మళ్ళీ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు .

ఇప్పుడు అదే స్ట్రాటజీ వాడాలని చూస్తున్నారట అన్నాదమ్ములు . చంద్రబాబు పై వ్యతిరేకత ఉంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి జనసేన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది . ప్రతిపక్ష నేతగా జగన్ విఫలమయ్యాడు కాబట్టి జనసేన కు చాన్స్ ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తామని అంటున్నాడు పవన్ అయితే జనసేన తరుపున చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దింపాలని చూస్తున్నారట . 2009 ముఖ్యమంత్రి పీఠం మాదే అని అనుకున్నారు మెగా బ్రదర్స్ కానీ పెద్ద దెబ్బ పడింది కట్ చేస్తే 2019 అంటే మళ్ళీ పదేళ్ళ తర్వాత ఆ చాన్స్ వస్తోంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నారట చిరంజీవి , పవన్ కళ్యాణ్ లు . అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: Chiranjeevi eyes on pawan’s janasena

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All