Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ ఫిల్మ్‌కి ముహూర్తం ఫిక్స్‌

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ఫిల్మ్‌కి ముహూర్తం ఫిక్స్‌

ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ ఫిల్మ్‌కి ముహూర్తం ఫిక్స్‌
ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ ఫిల్మ్‌కి ముహూర్తం ఫిక్స్‌

ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇద్ద‌రు స్టార్ డైరెక్ట‌ర్‌ల‌కు ఒత్తిడి మొద‌లైంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో కొమ‌రం భీం పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు ఎన్టీఆర్. ఆ పాత్ర తీరు ఎలా వుండ‌బోతుంద‌న్న‌ది ఇంత వ‌ర‌కు రివీల్ చేయ‌లేదు. అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన రోజున అల్లూరి లుక్‌కి సంబంధించిన టీజ‌ర్‌ని రిటీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

కానీ ఎన్టీఆర్ బ‌ర్త్‌డేకు ఎలాంటి లుక్‌ని గానీ, టీజ‌ర్‌ని గానీ రివీల్ చేయ‌లేదు. దీంతో ఫ్యాన్స్ ఆగ్ర‌హంగా వున్నార‌ట‌. ఎన్టీఆర్ టీజ‌ర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ని అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేయాల‌ని ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఇదిలా వుంటే మాట‌ల మాంత్రికుడికి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెక త‌గిలింది. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇంకా ప్రారంభం కాలేదు.

- Advertisement -

దీన్ని ప్రారంభించ‌కుండా మ‌రో చిత్రాన్ని మొద‌లుపెట్టొద్ద‌ని త్రివిక్ర‌మ్‌ని ఒత్తిడి చేస్తున్నార‌ట‌.  `అర‌వింద స‌మేత త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కావ‌డంతో అంత‌కు మించి వుండాల‌ని ఫ్యాన్స్ చెబుతున్నార‌ట‌. వెంక‌టేష్ 75వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ చేయ‌బోతున్నారంటూ వ‌రుస క‌థ‌నాలు రావ‌డంతో
ఫ్యాన్స్ ఒక్క‌సారిగా నిర్మాణ సంస్థ‌పై మండిప‌డ్డారు. వెంట‌నే తేరుకున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్టీఆర్ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో సెట్స్‌పైకి తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All