
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపర్‌స్టార్ రామ్‌చరణ్ తొలి సారి కలిసి నటిస్తున్నారు. దక్షిణాదిలోనే అత్యంత భారీ చిత్రంగా, క్రేజీ మూవీగా తెరపైకి వచ్చిన ఈ చిత్ర షూటింగ్ కరోనా వైరస్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. వైరస్ తీవ్రత తగ్గిన తరువాత షూటింగ్ మొదలుపెట్టాలని రాజమౌళి భావించారు కానీ రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో హీరోలు ట్రయల్ షూట్‌కి కూడా రావడానికి ఇష్టపడలేదు.
దాంతో ఆ ప్రయత్నాలని జక్కన్న పక్కన పెట్టారు. ఈ లోగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలకు లోబడి షూటింగ్‌లు చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. రాజమౌళి షూటింగ్ మళ్లీ మొదలుపెట్టాలని ప్రయత్నాలు ప్రారంభించిన సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు కరోనా సోకడం తెలిసిందే. తాజాగా కరోనా నుంచి కోలుకున్న జక్కన్న `ఆర్ ఆర్ ఆర్`ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారట.
దసరా తరువాత షూటింగ్‌ని పునః ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్టు తెలిసింది. అల్యూమియం ఫ్యాక్టరీలో కీలక షెడ్యూల్‌ని ప్లాన్ చేశారట. ఇప్పటికే సెట్స్‌ని ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్‌లో ఫారిన్ యాక్టర్స్ పాల్గొన బోతున్నారట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లని చిత్ర బృందం చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.