Homeన్యూస్ఆసక్తికర కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ శిష్యుడి ట్యాక్సీ టైటిల్ లోగో

ఆసక్తికర కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ శిష్యుడి ట్యాక్సీ టైటిల్ లోగో

ఆసక్తికర కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ శిష్యుడి ట్యాక్సీ టైటిల్ లోగో
ఆసక్తికర కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ శిష్యుడి ట్యాక్సీ టైటిల్ లోగో

ప్రస్తుత కాలంలో యువ టాలెంట్ ను  భారీ అవకాశాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు కూడా భిన్నమైన కాన్సెప్ట్ లతో ఆసక్తికర చిత్రాలను మనకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే హరీష్ సజ్జా అనే నూతన దర్శకుడు తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఆసక్తికర టైటిల్ ట్యాక్సీ ఫిక్స్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసాడు హరీష్ సజ్జా.

ఈరోజు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేసారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే ట్విస్ట్, టెన్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ సినిమాలో అంతకు మించి సస్పెన్స్ ఉంటుందని చెబుతూ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేసారు. ఈ టైటిల్ లోగోలో ఆసక్తికరంగా అనిపించేది ఒక గన్ పై కార్ ఉండటం. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ చిత్రం అమితంగా ఆకర్షిస్తుందని నిర్మాతలు గట్టిగా చెబుతున్నారు.

- Advertisement -

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మొటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్, ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత మొదలగు వారు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హెచ్ అండ్ హెచ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హరిత సజ్జా నిర్మిస్తున్నారు. మార్క్ రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All