
టాలీవుడ్‌లో భారీ చిత్రాల పరంపర కొనసాగుతోంది. `బాహుబలి` తరువాత తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పరిథి పెరగడంతో కొత్త కొత్త కాంబినేషన్‌లు. భారీ చిత్రాలు తెరపైకొస్తున్నాయి. తాజాగా మరో భారీ మల్టీస్టారర్ చిత్రం సెట్స్‌పైకి రాబోతోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ , రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం తెరపైకి రానున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` మూవీ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.
సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. అయితే ఈ మూవీ కోసం ఆయనకు భారీగానే చిత్ర బృందం పారితోషికాన్ని అందిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నందుకు గాను త్రివిక్రమ్‌కు దాదాపు మేకర్స్ 10 కోట్లు పారితోషికం ఇస్తున్నట్టు తెలిసింది. కొన్ని రోజుల క్రితం త్రివిక్రమ్ ఈ మూవీతో అసోసియేట్ కాబోతున్నారని, ఇందు కోసం ఆయనకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ని అందించబోతున్నారని వార్తలు వినిపించాయి. ఆ వార్తల్ని నిజం చేస్తూ చిత్ర బృందం త్రివిక్రమ్ ఈ మూవీతో అసోసియేట్ అయ్యారని, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారని అధికారికంగా ప్రకటించడం విశేషం. పవన్ పట్టుబట్టడం వల్లే త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారని తెలిసింది.