
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ యంగ్ హీరోలకు కొత్త ఆఫర్లిస్తున్నారు. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా వారిని చూపిస్తూ ఆకట్టుకుంటున్నారు. పవన్‌కల్యాణ్ నటించిన `అజ్ఞాత వాసి` చిత్రంలో ఆది పినిశెట్టిని విలన్‌గా చూపించిన త్రివిక్రమ్.. `అరవిం సమేత` లోనూ నవీన్‌చంద్రని జగపతిబాబుకు తనయుడిగా బాల్‌రెడ్డి పాత్రలో విలన్‌గా చూపించాడు.
ఇక ఈ సంక్రాంతికి విడుదలైన `అల వైకుంఠపురములో` చిత్రంలో సుశాంత్‌ని కీలక పాత్రలో చూపించారు. తాజాగా ఎన్టీఆర్ చిత్రం కోసం మరో యంగ్ హీరోని కీ రోల్ కోసం ఎంపిక చేసుకున్నారని తెలిసింది. అయితే ఆ హాఓ ఎవరనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
`ఆర్ ఆర్ ఆర్` పూర్తియితే జూన్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా దెబ్బతో అది కాస్తా ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. సమకాలీన రాజకీయాలపై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.