Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 11 నుండి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సినిమా

డిసెంబర్ 11 నుండి అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల సినిమా

Trivikram brings good news for Allu Arjun fansఅల్లు అర్జున్ ఫ్యాన్స్ కు శుభవార్త . ఎపుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా శుభవార్తే ! ఎందుకంటే డిసెంబర్ 11 నుండి అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రారంభం కానుంది అందునా దర్శకులు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రారంభం కానుంది . నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటించిన తర్వాత అల్లు అర్జున్ మరో సినిమా ఏది ప్రారంభించలేదు . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ కావడంతో అల్లు అర్జున్ కొత్త సినిమా అంగీకరించడానికి చాలా సమయం తీసుకున్నాడు . త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాలని అల్లు అర్జున్ ఆరాట పడ్డాడు దానికి తగ్గట్లుగా అరవింద సమేత చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించడంతో అల్లు అర్జున్ సంతోషంగా ఉన్నాడు .

విక్రం కుమార్ దర్శకత్వంలో కూడా నటించాలని అనుకున్నాడు కానీ విక్రం కుమార్ పూర్తీ కథ సిద్దం చేయకపోవడంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు . విక్రం కుమార్ మంచి చిత్రాలు తీస్తాడనే పేరుంది కానీ కమర్షియల్ సక్సెస్ లు తక్కువ దాంతో త్రివిక్రమ్ వైపు మొగ్గు చూపాడు అల్లు అర్జున్ . డిసెంబర్ 11 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రం 2019 లో విడుదల కానుంది . ఇంతకుముందు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా ఆ రెండు కూడా హిట్ అయ్యాయి దాంతో హ్యాట్రిక్ కోసం మరోసారి వస్తున్నారు .

- Advertisement -

English Title: Trivikram brings good news for Allu Arjun fans

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All