Homeటాప్ స్టోరీస్అత్తగారింటికి వెళ్ళిన అల్లు అర్జున్

అత్తగారింటికి వెళ్ళిన అల్లు అర్జున్

Allu arjun dussehra festival celebrations in mother in law villageస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దసరా వేడుకల కోసం తన అత్తగారింటికి వెళ్ళాడు . నల్గొండ జిల్లాలోని చింతపల్లి అనే గ్రామంలో సేద తీరుతున్నాడు అల్లు అర్జున్ . ఇంతకుముందు కూడా దసరా పండగ సందర్భంగా పలుమార్లు చింతపల్లి వెళ్ళాడు అల్లు అర్జున్ . స్టార్ హీరో తమ గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున అతడ్ని చూడటానికి ఎగబడ్డారు . చిన్న గ్రామం అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా రావడంతో చింతపల్లి లో సందడి నెలకొంది . తనని చూడటానికి వచ్చిన చిన్నారులను పెద్దలను కలిసి మాట్లాడాడు అల్లు అర్జున్ .

ఇక ఇది సెల్ఫీ ల కాలం కావడంతో చాలామంది అల్లు అర్జున్ తో సెల్ఫి దిగడానికి పోటీ పడగా ఇబ్బంది ఎదురయ్యింది . తోపులాట జరిగింది . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫ్లాప్ అయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అల్లు అర్జున్ . ఇటీవలే అరవింద సమేత చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు అల్లు అర్జున్ . జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: Allu arjun dussehra festival celebrations in mother in law village

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All