Homeరివ్యూస్టచ్ చేసి చూడు రివ్యూ

టచ్ చేసి చూడు రివ్యూ

నటీనటులు : రవితేజ , రాశి ఖన్నా , సీరత్ కపూర్
నేపథ్య సంగీతం :
మణిశర్మ
నిర్మాతలు :
వల్లభనేని వంశీ – నల్లమలుపు బుజ్జి
దర్శకత్వం :
విక్రమ్ సిరికొండ
రేటింగ్ :
2. 5/ 5
రిలీజ్ డేట్ :
2 ఫిబ్రవరి 2018

 

- Advertisement -

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ” టచ్ చేసి చూడు ”. విక్రమ్ సిరికొండ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ వల్లభనేని వంశీ – నల్లమలుపు బుజ్జి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

కార్తికేయ (రవితేజ ) కు కుటుంబం అంటే అమితమైన ప్రేమ , అయినప్పటికీ పుష్ప (రాశి ఖన్నా ) ని చూడగానే ప్రేమలో పడతాడు , పుష్ప కు కూడా కార్తికేయ అంటే ఇష్టమే ! అదే సమయంలో కార్తికేయ చెల్లెలు ఓ హత్య కేసులో సాక్షిగా నిలుస్తుంది . చెల్లి ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఆమెని రక్షించడానికి పూనుకుంటాడు కార్తికేయ . అయితే తన చెల్లెలు ని చంపడానికి చూస్తున్న హంతకుడు గతంలో తనకు ఛాలెంజ్ విసిరిన ప్రత్యర్థి అని తెలుసుకొని షాక్ అవుతాడు . దాంతో వదిలేసిన పొలిసు ఉద్యోగంలో మళ్ళీ జాయిన్ అవుతాడు కార్తికేయ . అసలు కార్తికేయ పోలీస్ ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసాడు ? మళ్ళీ ఎందుకు పోలీస్ గా మారాడు ? చివరకు ఆ హంతకుడి అంతం చూసాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
రవితేజ
రీ రికార్డింగ్
సీరత్ కపూర్ గ్లామర్
డ్రా బ్యాక్స్ :

కథ
కథనం
పాటలు

నటీనటుల ప్రతిభ :

రవితేజ తనకు అచ్చి వచ్చిన పాత్ర కావడంతో అవలీలగా కార్తికేయ పాత్రని పోషించాడు అంతేగాదు తనదైన జోష్ ని అందించి మరింతగా మెప్పించాడు . సినిమా మొత్తాన్ని ఒక్కడే తన భుజస్కంధాలపై మోశాడు రవితేజ . రాశి ఖన్నా – రవితేజ ల మధ్య రొమాంటిక్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి , సీరత్ కపూర్ స్కిన్ షో చేసింది కానీ నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది పాపం . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :

వల్లభనేని వంశీ – నల్లమలుపు బుజ్జి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి , మణిశర్మ నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది అలాగే చోటా ఛాయాగ్రహణం కూడా . కానీ కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ మాత్రం ఫస్టాఫ్ ని కాస్త ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించినప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయాడు . బలమైన విలన్ లేకపోవడం కూడా మరో మైనస్ ఈ చిత్రానికి .

ఓవరాల్ గా :

టచ్ చేసి చూస్తే ……. తుస్సే

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All