Homeటాప్ స్టోరీస్ఈ హీరోలకు ప్యాన్ ఇండియా కథలు కావలెను

ఈ హీరోలకు ప్యాన్ ఇండియా కథలు కావలెను

ఈ హీరోలకు ప్యాన్ ఇండియా కథలు కావలెను
ఈ హీరోలకు ప్యాన్ ఇండియా కథలు కావలెను

ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా హీరోలు,దర్శకులు, నిర్మాతలకు ప్యాన్ ఇండియా మోజు పెరిగింది. బాహుబలికి ముందు ఈ తరహా సినిమాలు మనం చూసింది లేదు. కానీ దానిలో కమర్షియల్ లాభాలు చూసిన సినిమా వాళ్ళు తమ సినిమాలను ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అనే ప్రాధమిక లెక్కలు కూడా వేసుకోకుండా బడ్జెట్ కలిసొస్తుంది కదా అని చెప్పి తమ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రిలీజ్ అని గొప్పగా ప్రకటించుకుంటున్నారు. అయితే ఇందులో నిజంగానే ప్యాషన్ గా ప్యాన్ ఇండియా రిలీజ్ చేసి సక్సెస్ సాధించిన వారు కూడా ఉన్నారు. ప్రభాస్ ఇప్పటికే మూడు సినిమాలు దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేసాడు. ఇప్పుడు చేస్తోన్న ప్రేమకథా చిత్రం కూడా ఇండియా వైడ్ గా తెరకెక్కుతోంది. నాగ్ అశ్విన్ తో చేయబోయే చిత్రం కూడా ప్యాన్ ఇండియా రిలీజ్ అన్న విషయం తెల్సిందే.

ఇప్పుడు విజయ్ దేవరకొండ, మంచు మనోజ్ తదితర హీరోలు కూడా ప్యాన్ ఇండియా ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి చిత్రం ఆర్ ఆర్ ఆర్ ద్వారా ప్యాన్ ఇండియా రిలీజ్ ను చూడబోతున్నారు. ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో విడుదల కాబోతోంది.

- Advertisement -

ఇక టాప్ హీరోలైన మహేష్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కు కూడా ప్యాన్ ఇండియా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ప్యాన్ ఇండియా లెవెల్లో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ ఏదీ వర్కౌట్ కావడంలేదు. మహేష్ కూడా సరైన కథతో వస్తే ప్యాన్ ఇండియా లెవెల్ సినిమా చేయడానికి తాను సిద్ధమే అని ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ ఇద్దరు హీరోలకు సరైన కథలు దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ – క్రిష్ తో చేయబోయే సినిమాను ఇండియా వైడ్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా టాలీవుడ్ అంతా ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టుకుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All