Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ఇదే

విజయ్ దేవరకొండ కొత్త సినిమా టైటిల్ ఇదే

tilte confirmed for vijay devarakonda and parasuram filmవిజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో స్టార్ డం అందుకున్న హీరో కాగా ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీ గా ఉన్నాడు . ఇప్పటికే విజయ్ నటించిన ” టాక్సీ వాలా ” చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా తాజాగా మరో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి . అందులో గీతా ఆర్ట్స్ 2 సంస్థ పరశురామ్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తోంది ఆ చిత్రానికి ” గీత గోవిందం ” అనే టైటిల్ ని ఖరారు చేసారు .

అయితే ఈ టైటిల్ ని రేపు అధికారికంగా ప్రకటించనున్నారు ఆ చిత్ర బృందం . గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై పలు విభిన్న కథా చిత్రాలను తెరకెక్కించాలని భావిస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల కొన్ని చిత్రాలు వచ్చాయి ఇక ఈ గీత గోవిందం చిత్రం కూడా అదే కోవలో రానుంది . రష్మిక హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ విభిన్న తరహా పాత్ర పోషిస్తున్నాడట . విజయ్ దేవరకొండ చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడటంతో గీత గోవిందం చిత్రానికి అప్పుడే క్రేజ్ ఏర్పడింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All