Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ని అక్కడ దింపేది ఎవరు

విజయ్ దేవరకొండ ని అక్కడ దింపేది ఎవరు

vijay devarakonda wants lift for CM officeతనని ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర డ్రాప్ చేసేవాళ్ళు కావాలని అంటున్నాడు అర్జున్ రెడ్డి చిత్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ . ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర దించితే తనకు వచ్చిన ఫిల్మ్ ఫేర్ అవార్డు ని ముఖ్యమంత్రి సహాయనిధి కి అందిస్తానని అంటున్నాడు ఈ హీరో . అర్జున్ రెడ్డి చిత్రంలోని నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించింది దాంతో ఆ అవార్డు ని వేలం వేసి ఆ సొమ్ము ని ముఖ్యమంత్రి సహాయనిధి కి ఇవ్వాలని అనుకున్నాడు . ఈ విషయం తెలుసుకున్న ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విజయ్ ని అప్రిషియేట్ చేయడంతో నన్ను ముఖ్యమంత్రి ఇంటి దగ్గర లేదా ఆఫీసులోనైనా దింపండి ఈ అవార్డు ఇచ్చేస్తాను అంటూ రీ ట్వీట్ చేసాడు విజయ్ దేవరకొండ .

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం పెరిగింది , ఇక మహానటి చిత్రంలో కూడా విజయ్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది . ప్రస్తుతం టాక్సీ వాలా విడుదల కావాల్సి ఉంది . హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన టాక్సీ వాలా పై చాలా ఆశలే పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All