Homeటాప్ స్టోరీస్కేజీఎఫ్ 2లో ఆ మూడు ఫైట్స్ మైండ్ బ్లోయింగ్‌!

కేజీఎఫ్ 2లో ఆ మూడు ఫైట్స్ మైండ్ బ్లోయింగ్‌!

Three major battles highlight in KGF 2
Three major battles highlight in KGF 2

సైలెంట్‌గా వ‌చ్చి సంచ‌లనం సృష్టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. య‌ష్ స‌త్తా ఏంటో క‌న్న‌డ చిత్ర పీమ‌తో పాటు యావ‌త్ ప్రపంచానికి చాటి చెప్పింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా క‌లెక్ష‌న్‌ల వ‌ర్షం కురిపించి క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక వ‌సూళ్ల‌ని సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రూపొందుతున్న విష‌యం తెలిసిందే. తొలి భాగాన్ని మించి రెండ‌వ భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా పాన్ ఇండియా స్థాయిలో ఆక‌ట్టుకున్న ఈ సినిమా తొలి భాగం గ‌రుడ‌ని అంతం చేయ‌డంతో ముగుస్తుంది. అయితే దాని త‌రువాత గ‌రుడ అనుచ‌రుల‌తో రాఖీ చేసే బీక‌ర పోరుని రెండ‌వ భాగంలో చూపించ‌బోతున్నారు. ఇది సినిమాకు వ‌న్ ఆఫ్ ద హైలైట్‌గా నిలుస్తుంద‌ట‌. దీనితో పాటు మ‌రో రెండు యాక్ష‌న్ ఘ‌ట్టాలు కూడా ప్రేక్ష‌కుల్ని అబ్బుర‌ప‌రుస్తాయ‌ని. సినిమాలో ఈ స‌న్నివేశాలు రోమాంచితంగా వుంటాయ‌ని వినిపిస్తోంది.

- Advertisement -

అధీరాతో, ఇనాయ‌త్ క‌లీ, క‌మ‌ల్‌తో చేసే ఫైట్స్ ఇండియ‌న్ సినిమాల్లోనే నెవ్వ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆప్ట‌ర్ అని చిత్ర బృందం చెబుతోంది. ఈ భీక‌ర పోరులో రాఖీభాయ్ మ‌ర‌ణిస్తాడ‌ని క‌న్న‌డ వ‌ర్గాల టాక్‌, ట్రైల‌ర్‌లో చెప్పిన‌ట్టుగా  అగ్రేట్ స్టోరీస్ ఎండింగ్‌ని ఆ విధే రాస్తుంది` అన్న‌ట్టుగానే విధి ఆడిన ఆట‌లో రాఖీభాయ్ చ‌నిపోతాడ‌ని పార్ట్ 2లో చెబుతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All